శిక్ష విధిస్తే.. IAS సందీప్ కుమార్ జీవితకాలం జైల్లోనే
ఐఏఎస్ సందీప్ కోర్టు ధిక్కారణ కేసులో హైకోర్టు విచారణ
ఎన్నో కోర్టు ధిక్కారణ పిటిషన్లు
హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్(Senior IAS officer Sandeep Kumar) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణకు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డుకు(Cantonment Board) రూ. 33 కోట్లు చెల్లించకపోవడంతో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. జులై 10న విచారణకు హాజరుకావాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. విచారణకు గైర్హాజరు, అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో సందీప్ కుమార్ కు గతంలో హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సందీప్ ను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని గతంలో హైదరాబాద్ సీపీకి(Hyderabad CP) కోర్టు ఆదేశించింది. కోర్టుకు హాజరవుతానంటే రూ. 5 వేల పూచీకత్తు తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యారు.
శిక్ష విధిస్తే జీవితకాలం జైలులోనే
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక(Justice Nagesh Bheemapaka) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను హైకోర్టుకు పిలిపించడం బాధగానే ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శగా సందీప్ పై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని జస్టిస్ నగేష్ వెల్లడించారు. శిక్ష విధిస్తే జీవితకాలం జైలులోనే ఉండాల్సి వస్తుందని హైకోర్టు జస్టిస్ స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పుల వల్ల అధికారులు కోర్టు ధిక్కారణ పిటిషన్లు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. రైతుబంధు మంచి ఫథకమైనా కోటీశ్వరులు కూడా లబ్ధి పొందుతున్నారని నగేష్ ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందాని నగేష్ భీమపాక వెల్లడించారు. ఎందరో అనర్హులు ఉచిత పథకాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






