7 August, 2026 | 2:33 PM

ఈనెల 9న పద్మశాలి సంఘం ఎన్నికలు

07-08-2026 01:21 PM

బోథ్. ఆగస్టు 7 (విజయక్రాంతి): ఈనెల 9న ఆదిలాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు బోథ్ నిర్వహించనున్నందున అవసరమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పద్మశాలి సంఘం  మండల అధ్యక్షులు మెరుగు భోజన్న స్థానిక ఎస్సై వి పురుషోత్తం కువినతిపత్రం అందించారు. మండల కేంద్రంలోని నాగభూషణం పాఠశాలలో పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్హత్నూ,ర్ సోనాల మండలాలకు చెందిన పద్మశాలి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పోలీసులు అధికారులు సహకరించాలని వినతి పత్రంలో కోరారు.