తల్లిపాలు బిడ్డ ఆరోగ్య పరిరక్షణలో కీలకం
07-08-2026 01:27 PM
బోథ్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మండలంలోని సాంగ్ వి అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను ఏఎన్ఎం చంద్రకళ గ్రామస్తులకు వివరించారు. బిడ్డ ఎదుగుదలను కీలకపాత్ర పోషించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని తల్లిపాలు పెంచుతా అన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత వివరించి ఆరు నెలల పాటు తల్లి తప్పనిసరిగా పాలు ఇవ్వాలని గ్రామంలోని తల్లులకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమురం లలిత ఉప సర్పంచ్ బలియా సుందర్ పాఠశాల ఉపాధ్యాయుడు తెలంగ రావు,పంచాయతీ కార్యదర్శి సీతారాం ఏఎన్ఎం చంద్రకళ, అంగన్వాడి ఉపాధ్యాయురాలు సుంది భాయ్, గ్రామంలోని మహిళలు పాల్గొన్నారు.






