7 August, 2026 | 2:18 PM

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

07-08-2026 01:23 PM

బోథ్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని బోత్ మండల పద్మశాలి సంఘం వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చేనేత పైన ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారని వారికి సరైన ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం సహకరించాలన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు మెరుగు భోజన్న ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ సభ్యులు ఆడేపు ప్రసాద్ ,వడ్లకొండ సురేందర్, తడక పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.