7 August, 2026 | 2:18 PM

న్యూట్రి గార్డెన్ ఏర్పాటు.. మొక్కలు నాటిన ఎంపీడీవో

07-08-2026 01:25 PM

బోథ్, ఆగస్టు 7(విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఎంపీడీవో రమేష్ ఆరోగ్య పాఠశాలలో భాగంగా న్యూట్రి గార్డెన్ మొక్కలను నాటారు. ఉసిరి ,పనస , సూదినిమ్మ తదితర రకాల మొక్కలను నాటడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ డీఎల్ఓ రమేష్, సర్పంచ్  విశ్వేశ్వరరావు, ఉపసర్పంచ్ డేగల గంగామణి పంచాయతీ కార్యదర్శి సమ్రీన్ సుల్తానా, ప్రధానోపాధ్యాయులు సబ్బాని కిషోర్, వార్డు సభ్యులు దేశం లింగు భాయ్ గ్రామస్తులు పాల్గొన్నారు.