16 June, 2026 | 8:06 PM

Breaking News

జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీతో ఉత్తర్వులు జారీ   •   ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   నారాయణపూర్ లో ఉచిత వైద్య శిబిరంకు అపూర్వ స్పందన   •   ఫసల్ బీమా అమలు కాక దిగాలు పడుతున్న రైతన్న.   •   నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం   •   వినాయక దేవాలయంలో నూతన భవనం, ప్రధాన ద్వారం ప్రారంభం   •   ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన   •   నక్కలపల్లి గ్రామంలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం   •   12 ఏళ్ల మోడీ పాలన దేశ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చింది   •   విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి   •  

సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

02-06-2026 07:04 PM

సాలూర(విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూర రెవెన్యూ  కార్యాలయంలో మంగళవారం రోజున వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సాలుర మండల ఎమ్మార్వో నవాజ్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నవాజ్  మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం సిద్ధించిందని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఉద్యోగి, అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.