బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో చేరికలు
బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు ఉపసర్పంచ్ లతోపాటు నాయకులు కార్యకర్తలు భారీగా మంగళవారం మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరారు. చేరిన వారిలో తగిలేపల్లి గ్రామానికి చెందిన BRS పార్టీకీ సర్పంచ్ అల్లం గంగవ్వ, ఉప సర్పంచ్ వడ్ల గంగా ప్రసాద్, BRS పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అల్లం సాయిలు, ప్రభాకర్, గాండ్ల శ్రీనివాస్, యాదుల్, మ్యాదరి సాయిలు, దర్శనం శంకర్, అన్వర్,హుస్సేన్,బక్క రాములుతో పాటు సుమారు 50 మంది పోచారం భాస్కర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సంధర్బంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






