తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మంగలి నందు
నాగిరెడ్డిపేట్, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు మంగలి ఎల్లయ్య మండలాల వారిగా మండల అధ్యక్షులు బాధ్యతలు నియమించడంతో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షులుగా పోచారం గ్రామానికి చెందిన మంగలి నందును నియమించినట్లు ఆర్డర్ కాపీని అందజేయడం జరిగిందని మంగలి నందు పేర్కొన్నారు.
అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మాల్తుమ్మెద గ్రామానికి చెందిన శివకుమార్ గౌడును నియమించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పార్టీ తరఫున మండలానికి చెందిన ఇరువురి వ్యక్తులకు పదవులు లభించడంతో మండలంలోని పలువురు అభినందనలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగలి నందు, శివ కుమార్ గౌడ్లు తమపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ పదవులు సక్రమంగా నిర్వహించి బీసీ సంక్షేమం కోసం బీసీ ప్రజల కోసం పాటుపడి కొట్లాడుతామన్నారు.




