అక్రమ బోర్లుపై రెవెన్యూ అధికారులు చర్యలు
భూ యజమానికి జరిమానా
సికింద్రాబాద్, మార్చి10 (విజయక్రాంతి) అక్రమ బోరు తవ్వకం పై విజయక్రాంతి లో ప్రచురితమైన వార్తకు రెవిన్యూ అధికారులు స్పందించారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆబోర్డును సీజ్ చేశారు వివరాల్లోకి వెళ్తే గత నెలఫిబ్రవరి 22 సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫలమండి మేడిబావి వద్ద బూత్ బంగ్లా,ఊడలమర్రి స్థలం లో ఓ బిల్డర్ నిబంధనలకు విరుద్దంగా బోరింగ్ నిర్మాణం చేపట్టారు.చాలా కాలంగా శిధిలా వస్త లో ఉన్న ఓ బిల్డింగ్ ను ఇటీవల కూల్చివేసి ఆ స్థలంలో అపార్టుమెంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
అంతకు ముందుగానే ఆ స్థలంలో లోతైన సెల్లార్ తవ్విన బిల్డర్ అందులో రోబోటిక్ బోర్వెల్ వేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజల ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు అని విజయ క్రాంతి దినపత్రికలో ప్రచరణ అయిన సంగతి తెలిసిందే. పత్రిక ప్రచరణ అయిన వార్తను ఆధా రంగా చేసుకుని రెవెన్యూ అధికారులతనిఖీలలో అనుమతి లేకుండా రివర్స్ డ్రిల్లింగ్ యంత్రంతో బోరు ను తవ్వుతున్నట్లు గుర్తించిన అధికారులు గుర్తించారు. అనంతరం బోర్డు కుసంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసు కొని జరిమానా విధించారు.
స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నట్లుగా, కొన్ని ప్రాంతా ల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో విచ్చలవిడిగా ఎవరి ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తు న్నారని తెలుస్తోంది. ఈ కారణంగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న నియమాలను కచ్చితంగా పాటించాలని రెవెన్యూ అధికారులు సూచించారు. భవిష్యత్తులో అనుమ తులు లేకుండా బోర్లు తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హె చ్చరించారు.అలాగే ఇలాంటి అక్రమ బోర్లు కార్యకలాపాలు ఎక్కడైనా నిర్వహిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.




