13 June, 2026 | 4:10 AM

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణ

13-06-2026 12:30 AM
  1. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా మౌలిక వసతుల వృద్ధికి పెద్దపీట
  2. లాజిస్టిక్స్‌లోనూ సమర్థవంతంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం
  3. ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్’లో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): గ్లోబ ల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదుర య్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టం’ను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026’కు శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యా ప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందని తెలిపారు. అదే సముద్ర తీరంలేని రాష్ట్రాల (ల్యాండ్ లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు.

మర్చండైజ్ ఎగుమతుల్లో దేశం లోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమని వెల్లడించారు. ‘తెలం గాణ రైజింగ్  2047’ విజన్ లక్ష్యసాధనలో ‘లాజిస్టిక్స్’ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళి కలు రూపొందించామన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి (లిమిటేషన్)గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నామని వివరించారు. ‘లాజిస్టిక్స్ పాలసీ 2.0’ ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మో డల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్ హౌసింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామని తెలిపారు. లాజిస్టిక్ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్ తయారీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు.

ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాల జీస్‌ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్ చైన్, గ్రేడ్ ఏ వేర్ హౌసింగ్, ఆటోమేషన్, డిజిటల్ లా జిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మం త్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్ రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.