18 March, 2026 | 5:41 AM

ఘనంగా టెక్‌స్పార్క్-2026 సదస్సు

18-03-2026 02:02 AM

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో నిర్వహణ

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదా న్ పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞా న్స్ యూనివర్సిటీలో మంగళవారం ‘టెక్‌స్పార్క్ -2026’ పేరుతో రాష్ట్రస్థాయి సాంకేతి క సదస్సును ఘనంగా నిర్వహించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ) సహకారంతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) విభాగం ఆధ్వర్యం లో ‘ఇగ్నైటింగ్ ఐడియాస్, ఇంజనీరింగ్ ద ఫ్యూచర్‘ అనే నినాదంతో ఈ సదస్సును జరిపారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 15 విద్యా సంస్థల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నా రు.

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించేందుకు ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పేపర్ ప్రెజెం టేషన్, కోడింగ్ కాంటెస్ట్, టెక్నికల్ క్వి జ్, టెక్నికల్ డిబేట్, పోస్టర్ మేకింగ్, ట్రెజర్ హంట్ వంటి ఆసక్తికరమైన పోటీలను నిర్వహించగా, విద్యార్థులు తమ ప్రతిభను చాటా రు.

పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు దాదాపు 40 వేల నగదు బహుమతులు,  ప్రశంసా పత్రాలను అందజేశా రు. ముఖ్య అతిథి అంతర్జాతీయ స్థాయి సమాచార సాంకేతిక నిపుణులు డా. శ్రీనివాసరావు కోసిగంటి మాట్లాడుతూ.. విజ్ఞానా న్ని పంచుకోవడమే నిజమైన ఎదుగుదలని, భావి భారత ఇంజనీర్లు దేశ గమనాన్ని మార్చాలని పిలుపునిచ్చారు.

ఉత్తీర్ణత కోసం కాకుండా, విద్యార్థులు తమ సమయాన్ని నిరంతర అభ్యాసం కోసం వెచ్చించాలని, ముఖ్యంగా విద్యా దశలోనే ప్రాథమిక సూ త్రాలపై పట్టు సాధించాలని హితవు పలికారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫె సర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ.. టెక్‌స్పార్క్ వంటి వేదికలు విద్యార్థులలోని అద్వితీయమైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తాయన్నారు.