15 March, 2026 | 6:44 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అమానుషం

15-03-2026 03:32 PM

చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): తిర్యాణి మండలం లింగిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి దూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్న ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులను తరచూ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల ఓ చిన్నారిని తీవ్రంగా కొట్టడంతో అతని శరీరంపై దద్దుర్లు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, గ్రామస్తులు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.