15 March, 2026 | 6:43 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రాష్ట్రంలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి

15-03-2026 03:28 PM

హైదరాబాద్: మూసీపై ఇప్పటి వరకు డీపీఆర్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని, మూసీ భూములను ప్రపంచ బ్యాంక్ కు కట్టబెట్టే యత్నమని, రాష్ట్రంలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైడ్రాను పెట్టి ముఖ్యమంత్రి ఆరాచకం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. మూసి అభివృద్ధి భాగంగా ఫేజ్ 1 కోసం ఆరు నెలల క్రితం ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో 5,641 కోట్లు ఖర్చు అవుతుందని ప్రకటించిన ప్రభుత్వం, ఆరు నెలల తర్వాత దాదాపు రూ.1400 కోట్ల అంచనా ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.