29 August, 2026 | 1:30 AM

రాజన్న సేవకు ‘టాటా ఏస్’ విరాళం

29-08-2026 12:24 AM

వేములవాడ, ఆగస్టు 28, (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.7.25 లక్షల విలువైన మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రీజినల్ మేనేజర్ శ్రీ చి. రాజా నరేంద్ర వాహనాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) శ్రీ ప్రతాప నవీన్ కుమార్, ఈఈ రాజేష్లకు అధికారికంగా అందజేశారు.

వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి  ఎల్ రమాదేవి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి, రీజినల్ మేనేజర్ రాజా నరేంద్రతో పాటు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను ఆలయ పబ్లిక్ రిలేషన్స్ అధికారి పెరిక శ్రీనివాస్ వెల్లడించారు.