2 July, 2026 | 11:31 AM

Breaking News

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •  

తాండూరులో కాంగ్రెస్ వ్యూహ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు

07-10-2025 10:29 PM

తాండూరు (విజయక్రాంతి): తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసం బషీరాబాద్ లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చేపట్టాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం. బషీరాబాద్ మండలానికి చెందిన జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రధాన చర్చ జరిగింది. సర్వే ప్రకారం గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని.. ఎంపీపీ పీఠం తమ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కోరినట్లు తెలిసింది. ఇంకా ఈ భేటీలో పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బషీరాబాద్ మండల నాయకులు ఉన్నారు.