2 July, 2026 | 11:09 AM

కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు

02-07-2026 09:59 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జాజిరెడ్డిగూడెం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని,అట్టి నిర్మాణం పనులను గ్రామపంచాయతీ సిబ్బందితో చేయించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దాసరి సోమయ్య బుధవారం అన్నారు.ఇట్టి బస్ షెల్టర్ నిర్మాణం పనులను కాంట్రాక్టర్ తన సొంత వర్కర్లతో  చేయించాలే తప్పా.. గ్రామపంచాయతీ సిబ్బందితో  చేయించడం వలన గ్రామంలో పారిశుధ్య పనులు ఆగి పోతున్నాయని అన్నారు.జీపీ సిబ్బంది గ్రామంలో పనులు పక్కనపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బస్ షెల్టర్ నిర్మాణ పనులు చేయమని చెప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.