ఎప్‌సెట్‌లో టాలెంట్ స్కూల్ చిన్నారికి 689వ ర్యాంక్
సత్తుపల్లి మే19( విజయక్రాంతి): ఇటీవల విడుదలైన ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో పట్టణంలోని సిద్ధారం రోడ్ లో గల టాలెంట్ స్కూల్ చిన్నారి షేక్ అతియా కౌశర్ కి 689వ ర్యాంక్ సాధించినట్లు టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
నర్సరీ నుండి 10వ తరగతి వరకు టాలెంట్ స్కూల్ లో విద్యనభ్యసించి 10వ తరగతి ఫలితాల్లో 10 జిపిఏ సాధించి, విజయవాడలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి, ఇటీవల విడుదలైన ఎంసెట్ ర్యాంకుల్లో 689వ ర్యాంక్ సాధించడం పట్ల టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పులి అరుణ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో చదువుకుంటే జీవితం స్థిరపడుతుందని, మంచిర్యాంకు రావడం మన స్కూల్ కి గొప్ప వరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టాలెంట్ స్కూల్ యాజమాన్యం, స్కూల్ ఇన్చార్జి శంకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






