25 May, 2026 | 7:23 PM

రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ

25-05-2026 06:24 PM

పాలిసెట్‌లో నిశాంత్ రెడ్డి సత్తా

 అభినందనలు తెలియజేసిన డాక్టర్ డి ఎన్ కుమార్, ప్రతిభ. ఎడ్యుకేషనల్ డైరెక్టర్ టీవీపీసీ శాస్త్రి

చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఇటీవల విడుదల చేసిన ‘టీజీ  పాలీసెట్  పాలిసెట్ -2026’ ఫలితాల్లో , చర్ల మండల కేంద్రంలోని   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం పదో తరగతి విద్యార్థి పి. నిశాంత్ రెడ్డి  రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి పాఠశాలకు, చర్ల మండలానికి కీర్తిని చేకూర్చారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో నిశాంత్ రెడ్డి అసాధారణ ప్రతిభ కనబరిచి, ఎం బైపీసీ (అగ్రికల్చర్) విభాగంలో  రాష్ట్రస్థాయిలో 687వ ర్యాంక్ కైవసం చేసుకుని సత్తా చాటాడు.

రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన నిశాంత్ రెడ్డిని సోమవారం రాహూల్ విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ డి.యన్. కుమార్, డాక్టర్ ప్రతిభ  పాఠశాల ఎడ్యుకేషనల్ డైరెక్టర్ టి.వి.పి.సి. శాస్త్రి నిశాంత్ రెడ్డికి తమ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాహుల్ విజ్ఞాన్ ప్రిన్సిపల్ రాజు వర్మ, మాట్లాడుతూ... మా పాఠశాల విద్యార్థి నిశాంత్ రెడ్డి మొదటి నుండి చదువులో ఎంతో క్రమశిక్షణ, పట్టుదల గలవాడని. ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శకత్వాన్ని పాటిస్తూ చదివి పదవ తరగతి లో 573 మార్కులతో మండల స్థాయిలో ద్వితీయ స్థానం పొందటమే కాక ఇప్పుడు పాలిటెక్నిక్ లో రాష్ట్రస్థాయి లో 687వ ర్యాంక్ సాధించడం మన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయానికే కాకుండా చర్ల మండల ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు.

భవిష్యత్తులో నిశాంత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ వర్మ రాజు కొసరాజు హరిచరణ్, వైస్ ప్రిన్సిపాల్ యం.వి.యల్. నరసింహారావు, ఉపాధ్యాయులు బిట్రగుంట క్రాంతికుమార్, అద్దంకి బోసు బాబు, ఉపాధ్యాయ బృందం అంతా కలిసి రాష్ట్రస్థాయి ర్యాంకర్ పి. నిశాంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఆశీర్వదించారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు, తోటి విద్యార్థినీ విద్యార్థులు నిశాంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియ జేశారరు.