25 May, 2026 | 8:12 PM

మహిళా సంఘాలకు మరింత చేయూత

25-05-2026 07:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): మహిళా సంఘాలకు ప్రభుత్వపరంగా మరింత చేయూత అందించి ఆర్థిక బలోపితనికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరుచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మహిళా సంఘాల అభివృద్ధిపై పలు సూచనలు చేసినట్టు తెలిపారు.

జిల్లాలో పొదుపు సంఘాలను బలోపేతం చేయడం కుటీర పరిశ్రమలను నెలకొల్పడం వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ రంగాల్లో మహిళా సంఘాలకు అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు డి ఆర్ డి ఓ విజయలక్ష్మి మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు