25 May, 2026 | 7:29 PM

పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు

25-05-2026 06:41 PM

కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన కొండపల్లి శ్రీధర్

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పోరేషన్ పరిధిలోని పాల్వంచ పాలపయ్యతండా 31 డివిజన్లోని ప్రాథమిక పాఠశాల ను 6,7 తరగతులకు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టర్ ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో సమగ్ర అభివృద్ధి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ పత్రాన్ని అందజేశారు. పాలకోయ్యతండా, మంచికనగర్ లకు చెందిన గిరిజన, దళిత,బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు 6,7,8, 9,10 తరతులకు సుదూర ప్రాంతంలోని పాత పాల్వంచ ఉన్నత పాఠశాలకు వెళ్లే చదవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

జాతీయ రహదారిపై నిత్యం విపరీతమైన రద్దీతో బాల,బాలికలు రవాణా ఇబ్బందులు, భద్రతా సమస్యలు ఆర్థిక భారాలు ఎదుర్కొం టున్నారని, బాలికలు సాయంత్రం సమయంలో ఇంటికి చేరేవరకు భయభయంగా ఉండాల్సి వస్తుందని, ఇట్టి పరిస్థితుల్లో విద్య కొనసాగింపు పై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన, దళిత, బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ విద్యా సంవత్సరంలోనే పాలకాయ తండా ప్రభుత్వ పాఠశాలలో  6,7 తరగతులను పెంచాలని విజ్ఞప్తి చేశారు.