రైతులు అధైర్య పడొద్దు.. చివరి గింజ వరకు కొంటాం!!!
25-05-2026 07:19 PM
వేగంగా అన్లోడింగ్ చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
శివంపేట,(విజయక్రాంతి): అత్యంత వేగంగా ధాన్యం అన్లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం శివంపేట మండలం దొంతి గ్రామంలోని కామాక్షి బాయిల్డ్ రైస్ మిల్లును సివిల్ సప్లై అధికారులతో కలిసి అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అత్యంత వేగంగా అన్లోడింగ్ ప్రక్రియ జరపాలన్నారు. హమాలీ, రవాణాను సమకూర్చుకొని వేగంగా జరపాలన్నారు.అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, జగదీష్ తదితరులు ఉన్నారు.






