25 May, 2026 | 8:12 PM

స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులకు కుచ్చుటోపే

25-05-2026 07:06 PM

ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే.. ఉద్యమం తప్పదు.

తుంగతుర్తి,(విజయక్రాంతి): కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడి మీ టర్ల విధానాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయానిప్రయత్నం చేస్తుంది. ఈ విధానం వలన లక్షలాది మంది రైతాంగానికి విద్యుత్ అనేది గుదిబండగా మారుతుందని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. వ్యవసాయానికి విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం ఇప్పుడొస్తున్న ప్రభుత్వ సబ్సిడి పూర్తిగా ఎత్తి వేసి మొత్తం అయ్యే ఖర్చు రైతు నెత్తినమోపబడుతుందని అన్నారు.

ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే రద్దు చేస్తుందని అన్నారు రెండువందల యూనిట్లు ఫ్రీ గా పొందే గృహ వినియోగ దారులుగా ఉన్న పేద మధ్య తరగతి చెందిన ప్రజలందరూ ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపురిస్తుంది. గత  ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగకుండా నేను నా రాష్ట్ర రైతాంగానికి మోటార్లవద్ద మీటర్లు బిగించే ది లేదని తెగేసి చెప్పడం జరిగింది.

అట్లాంటి నాయకుని ప్రభుత్వాన్ని పోగొట్టుకొని రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లేస్తే ప్రజల. రైతుల పాలిట గుదిబండలాగాగ మారారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక. రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్.. బీజేపీ.ప్రభుత్వాలకు తగిన గుణ పాఠం చెప్పాలని అన్నారు.. సమావేశంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. మండల నాయకులు గాజుల యాదగిరి గోపగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.