ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత
యువత స్వయం ఉపాధిలో రాణించాలి
సుఖినోభవంతు ట్రస్ట్, మోహన్ చారిటబుల్ ట్రస్ట్ సేవా దృక్పథం
జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆ పన్నులను ఆదుకుంటేనే జీవితంలో సార్ధకత చేకూరుతుందని యువత స్వయం ఉపాధిలో రాణించాలని ట్రస్ట్ చైర్మన్ రత్నప్రభ పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ భాను రెడ్డిలు తెలిపారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేద దివ్యాంగ యువతి వరలక్ష్మికి స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో సోమవారం కిరాణా షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుఖినోభవంతు ట్రస్ట్ చైర్మన్ రత్నప్రభ, భాను రెడ్డిలు మాట్లాడుతూ గతంలో ట్రస్ట్ పేదలకు కుట్టు మిషన్లు రైస్ బ్యాగులు వికలాంగులకు వీల్ చైర్లు విద్యార్థులకు పుస్తకాలు అందించడంతోపాటు నిరుపేద కుటుంబాలకు వివాహాలు తేదింటి ఆడపిల్లలకు పుస్తె మట్టలు తదితర ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఘనత ఈ ట్రస్ట్ కు ఉందని తెలిపారు. వికలాంగుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ సహకారంతో 20వేల రూపాయల విలువైన కిరాణా సామాగ్రిని వరలక్ష్మికి అందించి జీవనోపాధి కింద కిరాణా షాపును ఏర్పాటు చేశామని తెలిపారు.






