25 May, 2026 | 8:12 PM

మాజీ మంత్రి సతీమణి వియోగం

25-05-2026 07:15 PM

ఆర్మూర్‌,(విజయక్రాంతి): మాజీ మంత్రి, నిజామాబాద్ మాజీ జెడ్పి ఛైర్మన్, ఆర్మూర్‌ మాజీ  ఎమ్మెల్యే శనిగరం సంతోష్‌రెడ్డికి సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి శనిగరం విజయరెడ్డి (80) హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గల వారి నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో  డయాలసిస్‌ చికిత్స పొందుతున్నారు. శనిగరం సంతోష్‌రెడ్డి, విజయరెడ్డిల 60వ ప పెళ్లి రోజునే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులను కలచివేసింది. వారు తీవ్ర మనో వేదనకు గురయ్యారు.

బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌రెడ్డికి ఆర్మూర్‌ మండలం కల్లెడకు చెందిన విజయరెడ్డితో 1966 మే 25వ తేదీన వివాహం జరిగింది. వీరికి కూతురు మాధవి రెడ్డి, కుమారుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. మాధవి రెడ్డి బోధన్‌కు చెందిన కేప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి సతీమణి.  మనవడు ఆర్మమన్‌ అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఈ నెల 27వ తేదీన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రికి సతీవియోగం కలగడంతో మంత్రి శ్రీధర్‌బాబు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, అనుచరులు తరలి వెల్లి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.