శామీర్పేట ఔటర్పై ఘోర ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న డీసీఎం
25-05-2026 07:09 PM
శామీర్ పేట్,(విజయక్రాంతి): ఆగి ఉన్న కంటైనార్ ను డీ కొట్టిన డీసీఏం ఒకరు మృతి ఒకరికి గాయాలు అయినా ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ లు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శామీర్పేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






