మహిళ గురుకుల విద్యార్థుల ప్రతిభ
పురస్కారాలు సాధించిన విద్యార్థులు
అభినందించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు
కామారెడ్డి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (మహిళ), మర్కల్, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకరపరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభ రాణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ కామారెడ్డి విద్యార్థినులు షీ ఫర్ స్టెమ్ కల్పనా కార్యక్రమంలో అత్యుత్తమ విజయాలు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థినులు బి. నిచిత,బి. అనిత ప్రతిష్టాత్మక పురస్కారాలు, స్టెల్లార్ సిల్వర్ స్కాలర్షిప్లను 5,000 చొప్పున సాధించారు. కళాశాలకు 2 లాప్టాప్లు పురస్కారంగా లభించాయి.అంతేకాకుండా ఆరుగురు విద్యార్థినులు ప్రతిష్టాత్మక కల్పనా యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కి ఎంపికయ్యారు.
యాక్సిలరేటర్ ప్రోగ్రామ్లో ఎంపికైన విద్యార్థినులు బి. నందిని, ఐ. శ్రీజ,పి. రాజేశ్వరి, కె. ప్రియాంక, బి. నిచిత, బి. అనిత. ఈ విజయాల సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపల్ ఎస్. కృష్ణవేణి మరియు అధ్యాపక వర్గం విద్యార్థినులను, మార్గదర్శకత్వం చేసిన అధ్యాపకురాలు డాక్టర్. ఉజ్మాసుల్తానా ను అభినందించారు. విజయం సాధించిన విద్యార్థినుల కృషి, పట్టుదల, శాస్త్ర సాంకేతిక రంగాలపై వారికి గల అభిరుచి ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




