6 May, 2026 | 2:56 PM

TVK పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. INDIA కూటమి భవితవ్యం అయోమయం

06-05-2026 02:08 PM

చెన్నై: తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam), కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల అనంతర పొత్తు కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాల నడుమ తాము TVKకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ లేఖను విడుదల చేసింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమ మద్దతు కోరారని కాంగ్రెస్ తెలిపింది. సీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఒక్క షరుతుపై విజయ్ టీవీకే పార్టీకి మద్దతిస్తున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

ఇలాంటి రాజకీయ పరిణామాలపై మరిన్ని విశ్లేషణల కోసం మా Politics Section VijayaKranthi పేజీని చూడండి.

మతతత్వ శక్తులను చేర్చుకోకూడదని పార్టీ విజయ్ కు షరతు పెట్టినట్లు కాంగ్రెస్ తెలిపింది. తమిళ ప్రజలు లౌకిక, సంక్షేమ ప్రభుత్వం కావాలని తీర్పు ఇచ్చారని సూచించింది. విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రజలు ఎన్నుకున్నారని పేర్కొంది. లౌకిక, సంక్షేమ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేసిందని వెల్లడించింది. టీవీకే-కాంగ్రెస్ కూటమి లౌకిక, సంక్షేమ పాలన అందిస్తోందని కాంగ్రెస్ ప్రకటించింది.

తమిళనాడు ఎన్నికల పూర్తి ఫలితాల కోసం మా VijayaKranthi News Website హోమ్‌పేజీని సందర్శించండి.

లోక్ సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికల్లోనూ టీవీకేతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. తమ కూటమి కామరాజ్ పాలన స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తోందని స్పష్టం చేసింది. పెరియార్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పనిచేస్తోందని, యువత కలల సాకారం కోసం విజయ్, రాహుల్ ప్రతిజ్ఞ చేశారని కాంగ్రెస్ గుర్తుచేసింది. కాంగ్రెస్ నిర్ణయంతో ఇండి కూటమి భవితవ్యం అయోమయంలో పడింది. విజయ్ పార్టీకి మద్దతివ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకేతో కలిపి పోటీ చేసింది. ఎన్నికల తర్వాత డీఎంకేను వదిలి టీవీకేకు కాంగ్రెస్ మద్దతిచ్చింది.




ఇవి కూడా చదవండి:

తమిళనాడులో సంచలన ఫలితాలు.. విజయ్ TVK రికార్డు

బీజేపీ ఆఫర్‌కు టీవీకే నో! — 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనను ఖండించిన విజయ్ పార్టీ

Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం

బ్లాక్ బస్టర్ :తమిళ జన నాయకుడు విజయ్

విజయం మనదే నాన్నా!

విజయ్ డ్రైవర్ కొడుకు గెలుపు

ఆటో డ్రైవర్ నుంచి అసెంబ్లీకి

విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు?

విజయ్ ఇంటికి త్రిష

చరిత్ర సృష్టించిన విజయ్.. దళపతి ప్రస్థానం ఇదే..!