13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఇంటర్ నోడల్ అధికారిపై చర్యలు తీసుకోండి

16-12-2025 06:41 PM

బీసీ సంఘం డిమాండ్..

తాండూరు (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల నియామకాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ నిజమైన గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా నాయకులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పది సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్న అతిథి అధ్యాపకులకు తాజా నియామకాలలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని తెలిపారు. గత కొన్నేళ్లుగా అతిథి అధ్యాపకుల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలు చేసిన నోడల్ అధికారి శంకర్ నాయక్ పై తగు చర్యలు తీసుకొని గెస్ట్ లెక్చరర్ లకు న్యాయం చేసి అన్యాయంగా విధులనుండి తొలగించబడిన గెస్ట్ లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించాలని కోరారు.