31 August, 2026 | 2:45 AM

ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తైలి మధు

31-08-2026 01:37 AM

కార్యదర్శిగా శివకుమార్ గౌడ్ 

ఆదిభట్ల, అగస్టు 30 (విజయక్రాంతి): అ ఖిల భారత యువజన సమాఖ్య  రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తైలి మధు, కార్యదర్శిగా పి.శివకుమార్గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. తుర్కయంజాల్లోని అరుణ కన్వెన్షన్ హా ల్లో ఆదివారం నిర్వహించిన 18వ జిల్లా మ హాసభల్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించా రు.

ఈ సందర్భంగాఇబ్రహీంపట్నంలో ప్ర భుత్వ ఐటీఐ, ప్రతి నియోజకవర్గంలో మ హిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాల ని మహాసభ డిమాండ్ చేసింది. ఫోర్త్ సిటీ పరిశ్రమల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని, యాప్ ఆధారిత డెలివరీ, రైడ్ కార్మికులను ‘గిగ్ వర్కర్లు’గా గుర్తిం చాలని ప్రతినిధులు కోరారు. యువజన సం క్షేమం, విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని నూ తన నాయకత్వం తెలిపింది.