31 August, 2026 | 3:43 AM

ఘనంగా బోనాల పండుగ

31-08-2026 01:38 AM

ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ ఎస్‌ఆర్టి లోని శ్రీ ఉప్పలమ్మ లక్ష్మీమాత ఆలయంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ అమ్మవారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ నంతరం ఆలయ నిర్వాహకులు, స్థానికులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.