9 May, 2026 | 11:24 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు

09-05-2026 12:00 AM
  1. జిల్లాలో రోజుకు 480 లారీల ధాన్యం తరలించడం
  2. ధాన్యం తూకంలో పారదర్శకంగా జరిగేందుకు పటిష్ట చర్యలు
  3. కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, మే 8 (విజయ క్రాంతి) : రైతు సంక్షేమంలో భాగంగా మెదక్ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై కలెక్టర్ గారు ఒక ప్రకటన విడుదల చేస్తూ  రైతుల వద్ద నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు.

రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో సంబంధిత నగదును జమ చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళలలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలో ఇప్పటి 67,489,480 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెసి 62.87  కోట్ల  రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడము జరిగిందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్ల తో కప్పి ఉంచాలని కేంద్రాల నిర్వహకులకు తెలియజేయటం జరిగింది. ధాన్యం కొనుగోలు, రవాణా అంశాలలో వేసవి ఉష్ణోగ్రతతో పాటు ఇతర రాష్ట్రాలలో కొనసాగుతున్న ఎన్నికల సందర్భంగా రైస్ మిల్లుల నందు  హమాలీల కొరత ఏర్పడిందని తెలిపారు.

అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యం త్వరగా ఆరబెట్టి రైస్ మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని, వరి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అవసరం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని  కలెక్టర్ వెల్లడించారు.

టార్పాలిన్లు 15540, తూకం వేసే యంత్రాలు 668 ప్యాడీ క్లీనర్లు 278 తేమ శాతం చూసే మెషిన్లు 664 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని  కలెక్టర్ సూచించారు.