సత్తా చాటిన ఎస్‌వీఐఎస్
- సీబీఎస్‌ఈ జాతీయ వాలీబాల్ చాంపియన్ షిప్
- అండర్-17, 19 బాలుర, అండర్-19 బాలికల జట్టు ఎంపిక
తిరుపతి, ఆగస్టు 2026 : తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎస్‌వీ ఐఎస్) సీబీఎస్‌ఈ క్రీడల్లో వాలీబాల్‌కు సంబంధించి అరుదైన ఘనత సాధించింది. సీబీఎస్‌ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు ఆ పాఠశాలకు చెందిన మూడు జట్లు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్-తెలంగా ణ జోన్ (సీబీఎస్‌ఈ క్లస్టర్ VII)లో చాంపియన్‌గా నిలిచిన అండర్-17 బాలుర జట్టు, అండర్-19 బాలుర జట్టు మరియు అండర్-19 బాలికల జట్లు ఇప్పుడు జాతీయ ఛాంపి యన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ క్లస్టర్ కు ప్రాతినిధ్యం వహించనున్నాయి.
ఈ సీబీఎస్‌ఈ క్లస్టర్ VII వాలీబాల్ చాంపియన్‌షిప్ రెండు వేదికల్లో జరిగింది. అండర్-17 మరి యు అండర్-19 బాలుర పోటీలకు గద్వాల్ ఆతిథ్యం ఇవ్వగా, అండర్-19 బాలికల పోటీ లు అనంతపురంలో జరిగాయి. ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సీబీఎస్‌ఈ పాఠశాలలు పాల్గొన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ సుమన్, ప్రధాన కోచ్ అజిత్ మార్గదర్శకత్వంలో ఎస్‌వీఐఎస్‌కు చెందిన మూడు వాలీబాల్ జట్లు టోర్నమెంట్ అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రతి ష్టాత్మక సీబీఎస్‌ఈ జాతీయ ఛాంపియన్‌షి ప్‌కు అర్హత సాధించాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీలో అక్టోబర్‌లో జరగనున్న సీబీఎస్‌ఈ జాతీయ బాలుర వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో ఎస్‌వీఐఎస్ బాలుర వా లీబాల్ జట్లు పోటీపడనున్నాయి. అలాగే పంజాబ్‌లోని లూథియానాలో అక్టోబర్‌లో జరగనున్న సీబీఎస్‌ఈ జాతీయ బాలికల వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు ఎస్‌వీఐఎస్ బాలికల జట్టు ఎంపికైంది.






