ఆసీస్‌ను వణికించిన హాసన్
- 198 రన్స్‌కే అలౌట్
- తొలి టెస్టులో బంగ్లాదేశ్ జోరు
డార్విన్, ఆగస్టు 13: 23 ఏళ్ల సుదీర్ఘ విరా మం తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ తొలి రోజే ఆతిథ్య జ ట్టును వణికించింది. బంగ్లాదేశ్ యువ పేస ర్ హసన్ మహమూద్ కెరీర్ బెస్ట్ గణాంకాలతో (6/55) ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దె బ్బతీశాడు. కంగారూలు కేవలం 198 పరుగులకు ఆలౌట్ అయ్యారు. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఒక దశలో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టా ల్లో పడింది. అయితే స్టీవ్ స్మిత్ (71 పరుగులు) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కో రు అందించాడు.
ఈ మ్యాచ్ లో హసన్ మహమూద్ పేస్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ట్రావిస్ హెడ్ (22), జాక్ వెదరాల్డ్(23), మార్నస్ లబుషేన్(1), కామెరూన్ గ్రీన్(13), అలెక్స్ క్యారీ (19), బ్యూ వెబ్‌స్టర్(12), పాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్(1), నాథన్ లయ న్(7) తీవ్రం గా నిరాశపర్చారు. ఓవైపు వరుసగా వికెట్లు పడినా స్టీవ్ స్మిత్ ఒంటరి పోరా టం చేశాడు. హసన్ మహమూద్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 5 వికెట్ల హా ల్ సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా నిలిచాడు.
మరోవైపు టెస్ట్‌లో బంగ్లాదేశ్‌పై ఆసీ స్‌కు ఇదే అత్యల్ప స్కోర్. ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగిన ఆసీస్.. ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. అనంత రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదే శ్‌కు మంచి ఆరంభం వచ్చింది. ఓపెనర్ తం జిద్ హసన్ (32) వికెట్ కోల్పోయినప్పటికీ,
మొమినుల్ హక్ (35 నాటౌట్), షాద్మాన్ ఇస్లాం (20 నాటౌట్) రాణించారు. బంగ్లాదేశ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 102 ప రుగుల వెనుకంజలో ఉంది. మొత్తంగా తొలిరోజు బంగ్లాదేశ్ ఆధిపత్యం కనబరిచింది.






