మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సువీన్ యాదవ్
నాడు తండ్రి, నేడు తనయుడు
బోయినపల్లి: మే 14(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మనబోయిన సువిన్ యాదవ్ ను నియామకం చేస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రమణారెడ్డి రెండు దఫాలుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా పనిచేశారు. ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమ్మనబోయిన సువిన్ యాదవును నియామకం చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తన ఎన్నికకు కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మండల కాంగ్రెస్ నాయకులకు సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలాంటి పక్షపాతం లేకుండా నాయకులను కార్యకర్తలను సీనియర్ నాయకులను కలుపుకుని పనిచేస్తానని ఆయన చెప్పారు.
--నాడు తండ్రి, నేడు తనయుడు
బోయినపల్లి మండలం శాబాష్ పల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ కొమ్మనబోయిన మల్లేష్ యాదవ్ దశాబ్దాల కాలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోసీనియర్ నాయకులుగా పనిచేశారు. ఆయన జీవితకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి చివరకు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో తండ్రి బాటలో పయనిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. తన తండ్రి లాగే పార్టీలో పనిచేసే నాయకుల ప్రభుత్వం ఆధర అభిమానాలు పొందేందుకు నిరంతర కృషి చేస్తానని ఆయన చెప్పారు.






