15 May, 2026 | 4:17 AM

ధ్వని కాలుష్యంపై ఉక్కుపాదం

15-05-2026 12:37 AM
  1.   451 కేసులు నమోదు.. రూ. 6.14 లక్షల జరిమానా
  2. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు

మేడ్చల్, మే 14(విజయక్రాంతి): ధ్వనికాలుష్య నియంత్రణే లక్ష్యంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహ నాలకు మార్పులు చేసిన సైలెన్సర్లను అమ ర్చి, విపరీతమైన శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ పర్యవేక్షణలో కమిషనరేట్ పరిధిలోని ప్రధా న కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 451 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై రూ. 6,14,000 జరిమానా విధించారు.

సైలెన్సర్ల తొలగింపు..

76 వాహనాల నుంచి అనధికారిక సైలెన్సర్లను ఘటనా స్థలంలోనే తొలగించారు. మోటారు వాహన చట్టం ప్రకారం అనుమతించిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని పోలీసులు స్పష్టం చేశారు. అనధికారిక సైలెన్సర్ల వల్ల వచ్చే భారీ శబ్దాలు రోగులు, వృ ద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

ఇది ప్రజాశాంతికి భంగం కలిగించడమే కాకుండా రహదారి భద్రతకు కూడా ముప్పన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు వెంటనే తమ వాహనాలకు ఉన్న అదనపు సైలెన్సర్లను తొలగించుకోవాలని డీసీపీ సుమతి హెచ్చరించారు.