పెచ్చులూడుతున్నా పట్టించుకోరా?
కొండాపూర్, జూలై 23: సిపిఎం కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మల్లేపల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థుల సమస్యల పైన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అతిమేల మాణిక్యం మాట్లాడుతూ మల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలోని విద్యార్థులు సమస్యల వలయంలో సతమతమవుతున్న పరిస్థితి ఉందని అన్నారు.
విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక పెచ్చులు ఊడి పడుతున్నా తరగతి గదిలోనే విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శిధిల వ్యవస్థలో ఉన్న పాఠశాలను వెంటనే పునర్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టారు. విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, మరుగుదొడ్లను వెంటనే నిర్మించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మాణంలో ఆగిపోయిన బిల్డింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు. కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వారు గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు విద్యార్థుల సమస్యలపై స్పందించి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో సిపిఎం కొండాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండాపూర్ మండల కార్యదర్శి రాజయ్య, మండల కమిటీ సభ్యులు బాబురావు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






