7 August, 2026 | 5:15 PM

బాబుల్ గాంలో సర్వే పూర్తి

07-08-2026 03:32 PM

నిర్మల్, ఆగస్టు7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రక్రియ పక్కాగా పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 14 గ్రామాలను రీ సర్వే చేపట్టగా ఇప్పటికే బైంసా మండలంలోని బాబుల్ గాన్ గ్రామంలో 100% పూర్తి చేసినట్టు తెలిపారు. మిగతా గ్రామాల్లో 50% పైగా సర్వే పూర్తయిందని సర్వే చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులను ప్రజలను సమన్వయం చేసుకొని అధికారుల సమన్వయంతో రోజుకు 15 ఎకరాల వరకు ఒక్కొక్క బృందం సర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సర్వే యంత్రాలతో ఈ సర్వే ప్రభుత్వ లైసెన్స్ సర్వేయర్ల సహకారంతో నిర్వహిస్తున్నామని ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరు సర్వేకు సహకరించాలని కోరారు.