7 August, 2026 | 5:39 PM

హర్ ఘర్ తిరంగా ర్యాలీ

07-08-2026 05:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించాలని జోనల్ కన్వీనర్ రావుల రామ్నాథ్, జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. "యువతలో జాతీయ భావం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో బిజెపి దేశవ్యాప్తంగా31 నా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిజెపి నాయకులు హాజరుకారులను తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్ర కాంత్, జిల్లా కార్యదర్శి పుస్పూర్ నర్సారెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్ గౌడ్,కౌన్సిలర్లు సూరజ్ నాయక్, అయిండ్ల సాత్విక్,తల్వేద సర్పంచ్ నరేందర్, మాజీ మండల అధ్యక్షులు తోకల అనిల్,నాయకులు జుట్టు దినేష్,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు డి. నిరంజన్ రెడ్డి, ధార్మిక సెల్ జిల్లా అధ్యక్షులు కందుల హరీష్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమ్మరి వెంకటేష్, నాయకులు దీక్షిత్ రెడ్డి, సృజన్, మధు, సుమిత్ తదితరులు పాల్గొన్నారు.