అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి
- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఊరుకొండ పేట: అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ఆరోపించారు. ఊర్కొండపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపును నిరసిస్తున్న ముదిరాజులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తనను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు.
ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే వారిని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. గత పదేళ్ల పాటు అధికారంలో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించాలన్న కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ప్రజల గొంతును నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముదిరాజ్ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీసే చర్యలను తాము వ్యతిరేకిస్తామని గువ్వల బాలరాజు పేర్కొన్నారు.






