7 August, 2026 | 5:39 PM

సిద్దిపేట టిఐసిసిఐ కో-ఆర్డినేటర్‌గా బిక్షపతి

07-08-2026 04:59 PM

నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టిఐసిసిఐ) తెలంగాణ చాప్టర్ కో-ఆర్డినేటర్‌గా బుక్యా బిక్షపతి నాయక్  ఎంపికయ్యారు.ఈ నియామకంలో భాగంగా జిల్లాలోని గిరిజన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, ప్రభుత్వ పథకాలు,రుణ సదుపాయాలు, మార్కెట్ అవకాశాలపై వారికి అవగాహన కల్పించడం వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.

గిరిజనుల వ్యాపార అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నారు.సిద్దిపేట జిల్లాలో గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సంస్థ తరఫున మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షులు డా.శ్రీనివాస్ నాయక్ ధారావత్ తెలిపారు. బుక్యా బిక్షపతి నాయక్  నాయకత్వంలో జిల్లాలో టిఐసిసిఐ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.