7 August, 2026 | 5:39 PM

సింధు హాస్పిటల్స్‌లో తొలి HITHOC చికిత్స విజయవంతం

07-08-2026 05:13 PM

అరుదైన స్టేజ్ IVA థైమోమా రోగికి నూతన జీవం

హైదరాబాద్: సింధు హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సలో మరో మైలురాయిని అధిగమించింది. ఆసుపత్రిలో తొలిసారిగా హైపర్‌థర్మిక్ ఇంట్రాతోరాసిక్ కెమోథెరపీ (HITHOC) విధానంతో అత్యాధునిక శస్త్రచికిత్సను నిర్వహించి, అరుదైన స్టేజ్ IVA టైప్-B థైమోమా (థైమస్ గ్రంథి క్యాన్సర్)తో బాధపడుతున్న 35 ఏళ్ల రోగికి విజయవంతంగా చికిత్స అందించింది.

నియోఅడ్జువెంట్ కీమోథెరపీ అనంతరం వ్యాధి కొంతవరకు తగ్గినప్పటికీ, రోగి ఊపిరితిత్తుల పనితీరు తక్కువగా ఉండటంతో పాటు ఎడమ ఛాతీ భాగమంతా క్యాన్సర్ వ్యాపించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థైమెక్టమీ,ఎడమ టోటల్ ప్లూరెక్టమీ, సెగ్మెంటల్ లంగ్ రిసెక్షన్ అనంతరం HITHOC విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని, స్థిరమైన ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ అవుతున్నారు.

డా. కె.వి.వి.ఎన్. రాజు ఆధ్వర్యంలోని సర్జికల్ ఆంకాలజీ విభాగం వైద్యులు డా. మధు నారాయణ, డా. ఫైసల్, డా. వేణుగోపాల్ నేతృత్వంలోని అనస్థీషియా విభాగం వైద్యులు డా. శ్యామ్, డా. సురేష్ బాబు, అలాగే డా. ఆర్.వి. రావు ఆధ్వర్యంలోని మెడికల్ ఆంకాలజీ విభాగం వైద్యులు డా. అరుణ్, డా. సౌమిక మాట్లాడుతూ, ఎంపిక చేసిన స్టేజ్ IVA థైమోమా రోగుల్లో థైమెక్టమీతో పాటు ప్లూరల్ వ్యాధిని పూర్తిగా తొలగించి HITHOC నిర్వహించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి నియంత్రణ సాధించడంతో పాటు, కొన్ని సందర్భాల్లో పూర్తిస్థాయి నయం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు.

ఈ క్లిష్టమైన చికిత్స విజయవంతం కావడం సింధు హాస్పిటల్స్‌లోని సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా, మెడికల్ ఆంకాలజీ విభాగాల సమిష్టి కృషి, సమన్వయం, నైపుణ్యానికి నిదర్శనం అని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

సింధు హాస్పిటల్స్ చైర్మన్ డా. బండి పార్థసారథి రెడ్డి గారు ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆసుపత్రిలో మరో మైలురాయిని నెలకొల్పిన సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియా, మెడికల్ ఆంకాలజీ విభాగాల వైద్య బృందాలను హృదయపూర్వకంగా అభినందించారు. అత్యాధునిక వైద్యసేవలను అందించడంలో సింధు హాస్పిటల్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇలాంటి విజయాలు ఆసుపత్రి నాణ్యమైన క్యాన్సర్ చికిత్స పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.