చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శ్రీనివాస చేనేత సొసైటీ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. భక్త మార్కండేయ, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం చేనేత కార్మికులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ చేనేత సొసైటీ కంపౌండ్ వాల్ కు రూ.10 లక్షలు, పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ పూర్తి స్థాయి నిర్మాణా పనులకు రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్థానిక చేనేత సొసైటీ బకాయిల మాఫీ కోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో తనను వినియోగించుకోవాలని కోరారు.






