7 August, 2026 | 5:44 PM

సౌత్ ఇండియా కరాటేలో స్టెమ్‌స్పార్క్ విజయం

07-08-2026 05:01 PM

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ విద్యార్థులు సౌత్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్–2026 పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ–2026ను కైవసం చేసుకున్నారు. పోటీల్లో అండర్-14 కుమిటే బాలుర విభాగంలో టి. రోహిత్ బంగారు పతకం, కె. కౌషిక్ గౌడ్ కాంస్య పతకం, అండర్-12 కుమిటే బాలుర విభాగంలో ఎస్. కె. ఊబెద్ బంగారు పతకం, అండర్-12 కటా బాలుర విభాగంలో ఎన్. పృథ్విరాజ్ కాంస్య పతకం, ఈ. సంజయ్ రజత పతకం, అండర్-10 కటా బాలుర విభాగంలో ఎన్. మహద్యుత్ సాయి కాంస్య పతకం సాధించారు.

విద్యార్థుల అత్యుత్తమ ప్రదర్శనతో స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాఠశాల డైరెక్టర్లు కె. శ్రీధర్‌రావు, కృష్ణవేణి విజేతలను అభినందించి, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విజేతలను అభినందించారు.