7 July, 2026 | 2:56 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్

12-03-2026 01:14 AM

లక్ష్మణచందా, మార్చి ౧౧ (విజయక్రాంతి): ప్రజలంతా ప్రతిరోజు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని బాధ్యతగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, లక్ష్మణచందా మండలం పొట్టపల్లి (కె) గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి చీపురుతో పరిసరాలు శుభ్రం చేశారు.

కొడవలితో పిచ్చి మొక్కలను తొలగించారు.  అనంతరం గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడుతూ, 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాలలో గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని తెలిపారు. గ్రామస్తులు ఎవరూ కూడా తమ పిల్లలకు నిర్ణిత వయసు దాటనిదే వివాహాలు చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, జెడ్పి సిఈఓ శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసిల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథోడ్, గ్రామ సర్పంచ్ ముఖేష్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఇతర అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

రేపు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై శిక్షణ: కలెక్టర్ అభిలాష అభినవ్

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై రేపు పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ప్రజా ప్రతినిధులకు ఏర్పాటు చేయనున్న అవగాహన సదస్సులను ప్రజా ప్రతినిధులు సద్వినియోగిం చుకో వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక ప్రణాళిక పై సర్పంచ్‌లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.ఏర్పాట్ల పరిశీలనలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రమణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.