12 March, 2026 | 3:06 AM

గృహ ఎల్పీజీని వాణిజ్యానికి వినిగియోగిస్తే చర్యలు

12-03-2026 01:15 AM

సివిల్ సప్లయ్ శాఖ హెచ్చరిక 

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దాడులు  

172 గృహ ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం, కేసులు నమోదు 

హైదరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): గృహాలకు వాడే ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య వినియోగానికి పాల్పడుతున్న వాణిజ్య సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన సీఎఎఫ్, సీఎస్ టీమ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, కర్మన్‌ఘాట్‌లతో పాటు వివిధ ప్రాం తాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.

వివిధ యజమానుల నుంచి 22 గృహ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, బహు ళ గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 14న ఇబ్రాహీపట్నంలోని బొంగుళూరులో దాడులు చేయగా ఒక వ్యక్తి నుంచి 100 గృహ ఎల్పీజీ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లతో (రూ. 2,36,068 విలువ) పాటు ఒక వాహనం (రూ. 1,71,600 విలువ) స్వాధీనం చేసుకొని కేసులు నమో దు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు.  ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాల కోసం ఎవరైనా వినియోగిస్తే టోల్ ప్రీ నంబర్ 1967కు ఫోన్ చేయాలన్నారు.