మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మార్వాడీ యువ మంచ్ సిర్పూర్ కాగజ్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో మృతదేహాల కోసం ఉచిత ఫ్రీజర్ బాక్స్ ను మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్వాడీ యువ మంచ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. మృతదేహాల కోసం ఉచిత ఫ్రీజర్ బాక్స్ సేవను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
ప్రస్తుతం పేద కుటుంబాలకు దహన సంస్కారాల కోసం కట్టెల కొనుగోలుకే రూ.5 వేల వరకు ఖర్చవుతోందని, అలాంటి నిరుపేదలకు కూడా సంస్థ ఆర్థిక సహాయం అందించేలా ముందుకు రావాలని సూచించారు. మార్వాడీ యువ మంచ్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. అవసరమైన వారు 70138 74633 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు శివ, చిప్పకుర్తి శ్రీనివాస్, గజ్జెల లక్ష్మణ్, యెమ్మాజీ సంతోష్, మార్వాడీ యువ మంచ్ సభ్యులు, వ్యాపారవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.






