7 July, 2026 | 3:40 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

07-07-2026 02:44 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో మాదిగ సంఘం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. మాదిగ సంఘం అధ్యక్షుడు దొబ్బల సంజీవ్ మాట్లాడుతూ... ఎస్సీ కులాల్లోని ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలనే లక్ష్యంతో మందకృష్ణ మాదిగ 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్)ను స్థాపించి మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటం చేశారని తెలిపారు.

ఆయన నాయకత్వంలో జరిగిన ఉద్యమ ఫలితంగానే మాదిగ ఉపకులాల రిజర్వేషన్ సాధ్యమైందని పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ, రిజర్వేషన్ హక్కులను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు, దొబ్బల లింగయ్య, రాము, స్వామి, నరేష్, ప్రణయ్, మహేష్, ప్రభాకర్, సంజీవ్, రాజు, బొట్టు రాజు, పరశురాం, దండు నరసయ్య, ఓద్యారపు రాజయ్యతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మాదిగ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.