1 June, 2026 | 3:28 AM

కాంగ్రెస్‌లోకి చేరికల జోరు..

01-06-2026 12:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పలువురు చేరిక

కడ్తాల్, మే 31(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజాప్రతినిధులు, యువత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎ మ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆ దివారం హైదరాబాద్లోని ఆయన నివాసం లో కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్ సర్పం చ్ కేతావత్ రమేష్ నాయక్తో పాటు వార్డు స భ్యులు, తండా నాయకులు సహా 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, హామీల అమలుతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన చూసే నాయకులు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహ,బిచ్య నాయక్,మాజీ సర్పంచ్ నరేందర్ నాయక్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.