10-02-2026 01:47:30 AM
గెలిపించాలని 10వ వార్డు బీజేపీ అభ్యర్థి ఓటర్లకు విజ్ఞప్తి
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు (ఎల్లంపేట)లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ సోమవారం విస్తృత ప్రచా రం నిర్వహించారు.
ప్రచారానికి చివరి రోజు కావడంతో ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.తాను గెలిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారానికి వార్డులో మంచి స్పందన లభించింది. కమలం గుర్తుకు ఓటు వేసి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ను గెలిపిస్తామని ఓటర్లు హామీ ఇచ్చారు. ప్రచారంలో సుప్రియ శ్రీనివాస్ గౌడ్ వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
భారీ మెజారిటీతో విజయం సాధిస్తా
భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని బీజేపీ అభ్యర్థి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ఓటర్ల నుంచి అపూర్వస్పందన లభించింది అన్నారు.