20 June, 2026 | 4:45 AM

రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ను ఆదరించండి

20-06-2026 12:53 AM

తాడ్వాయి, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రక్షణ సమితిని ఆదరించండని తెలంగాణ రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన టిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఒంటి కాలి తో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత పోరాటం చేస్తుందని తెలిపారు. ఒక మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఆదరించాలని కోరారు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితిని బలపరచాలని ఆయన కోరారు.

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని టిఆర్‌ఎస్ పార్టీ ఎండగడుతుందని తెలిపారు. జరిగిన అవినీతిని బయటకు తీస్తూ ప్రజల ముందు ఉంచుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సమితిలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు భుజంగరావు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.